

రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ ఏకకాలంలో చిత్రీకరించారు. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ లయన్స్‌గేట్, కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి పనిచేసింది. అయితే ఇతర భాషల వెర్షన్లతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌ను మాత్రం ఒకేసారి థియేటర్లలోకి తీసుకురాలేకపోయారు.
తాజాగా టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్‌ను సెప్టెంబర్ 4న ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒరిజినల్ వెర్షన్ 3 గంటల 14 నిమిషాల నిడివితో ఉండగా, ఇంగ్లీష్ కట్‌ను మరింత క్రిస్ప్‌గా ఉండేలా కుదించారు. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తొలి వారంలో మిక్స్‌డ్ టాక్ రావడంతో, ఇంగ్లీష్ వెర్షన్‌కు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఆసక్తిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!