
ఆరోగ్యం

నటి త్రిష కృష్ణన్ తన తల్లి ఉమా కృష్ణన్ 70వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూల అలంకరణలు, కేక్, బంగారు రంగు "70" బెలూన్లతో అలంకరించిన వేడుకకు సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంటూ, "హ్యాపీ 70 మమ్ " అంటూ ప్రేమతో కూడిన శుభాకాంక్షలు తెలిపారు.
త్రిష సినీ ప్రయాణంలో ఉమా కృష్ణన్ కీలక పాత్ర పోషించారు. మిస్ చెన్నై 1999 పోటీలో పాల్గొనాలని త్రిషను ప్రోత్సహించింది కూడా ఆమెనే. అదే నిర్ణయం త్రిషను దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్రనటిగా నిలబెట్టింది. త్రిష చేసిన ఈ భావోద్వేగ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కూడా ఉమా కృష్ణన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లి–కూతుళ్ల అనుబంధాన్ని ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!