17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!

Writer: Chandrika 03:05 PM, 17 అక్టోబర్, 2026
30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!

తెరపై భావోద్వేగభరితమైన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించగల వెంకటేశ్‌, కుటుంబ కథా చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సహజ నటనతో అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న సౌందర్య కలయికలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘పవిత్రబంధం’. 1996 అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. అగ్రిమెంట్ మ్యారేజ్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. పెళ్లి, ప్రేమ, పరస్పర గౌరవం, కుటుంబ బాధ్యతల విలువను హృద్యంగా ఆవిష్కరించింది. వైవాహిక బంధాన్ని పెద్దగా పట్టించుకోని సంపన్న యువకుడిగా వెంకటేశ్‌ నటించగా, భర్త ప్రేమ కోసం పరితపించే సంప్రదాయ యువతిగా సౌందర్య ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరి పట్ల మరొకరు గౌరవాన్ని చాటుకునే సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించాయి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం, పోసాని కృష్ణమురళి సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం ‘పవిత్రబంధం’ విజయానికి మరో ప్రధాన కారణం. ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాసు ఆలపించిన ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ’ పాట ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారాన్ని అందుకోగా, సౌందర్య ఉత్తమ నటిగా, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు గెలుచుకున్నారు. తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ కథ ఇతర భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. దీంతో కన్నడ, హిందీ, తమిళం, బెంగాలీ, ఒడియా భాషల్లో రీమేక్‌ చేయడంతోపాటు బంగ్లాదేశ్‌లోనూ ఈ కథను తెరకెక్కించారు. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ, వైవాహిక బంధంలోని గొప్పతనాన్ని చాటిచెప్పిన ‘పవిత్రబంధం’ మూడు దశాబ్దాల తర్వాత కూడా తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి

సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!

సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

ట్యాగ్లు
పవిత్రబంధంవెంకటేశ్‌సౌందర్యముత్యాల సుబ్బయ్యతెలుగు సినిమాపవిత్రబంధం 30 ఏళ్లుఎం.ఎం. కీరవాణిఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యంనంది అవార్డులుతెలుగు సినిమా క్లాసిక్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోదావరి–కావేరీ లింకుతో తెలంగాణ నీటి హక్కులకు ముప్పు- హరీశ్‌రావు
రాజకీయాలు

గోదావరి–కావేరీ లింకుతో తెలంగాణ నీటి హక్కులకు ముప్పు- హరీశ్‌రావు

సద్దుల బతుకమ్మకు ట్యాంక్‌బండ్‌ ముస్తాబు.. రేపు సాయంత్రం నుంచి సంబరాలు!
జనరల్

సద్దుల బతుకమ్మకు ట్యాంక్‌బండ్‌ ముస్తాబు.. రేపు సాయంత్రం నుంచి సంబరాలు!

హైదరాబాద్‌లో ఎంజే మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ తిప్పలు..
జనరల్

హైదరాబాద్‌లో ఎంజే మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ తిప్పలు..

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు
రాజకీయాలు

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు

ఇండియా లో యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు. ఖండించిన భారత్
జనరల్

ఇండియా లో యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు. ఖండించిన భారత్

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!
సినిమాలు

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
జనరల్

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి
సినిమాలు

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
జనరల్

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?
ఓటీటీ

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
జనరల్

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!