
సినిమాలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి గురువారం చెన్నైలో కన్నుమూశారు. 96 ఏళ్ల శాంతకుమారి గత కొంతకాలంగా వయోభారంతో ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆమెను పరామర్శించేందుకు వచ్చిన సన్నిహిత స్నేహితురాలితో మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శాంతకుమారి పార్థివ దేహాన్ని చెన్నైలోని నివాసానికి తరలించారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆదర్శ దంపతులుగా పేరొందిన శోభన్‌బాబు-శాంతకుమారి దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు, నిర్మాతలు, నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!