
సినిమాలు

తమిళ సినీ రంగానికి చెందిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 10న తుదిశ్వాస విడిచారు. గ్రామీణ జీవితాన్ని, మానవ సంబంధాలను, ప్రేమలోని స్వచ్ఛతను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
భారతీరాజా మరణంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నివాళి అర్పించారు. ‘ఆరాధన’ చిత్రంలో ఆయన దర్శకత్వంలో నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, సినిమాపై భారతీరాజాకు ఉన్న అపారమైన ప్రేమ, సరళత, అంకితభావం తనపై చెరగని ముద్ర వేసాయని పేర్కొన్నారు. భారతీరాజా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన క్లాసిక్ చిత్రాల ద్వారా శాశ్వతంగా చిరంజీవిగా నిలిచిపోతారని అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!