

టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న స్నేహం మరోసారి చర్చనీయాంశమైంది. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. ఈ షోలో నిర్వహించిన ఓ గేమింగ్ రౌండ్‌లో భాగంగా తమకు ఇష్టమైన సెలబ్రిటీకి ఫోన్ చేయాలని విజయ్‌కు టాస్క్ ఇచ్చారు. దీంతో ఆయన రాత్రి 11.40 గంటల సమయంలో అల్లు అర్జున్‌కు కాల్ చేశారు. బన్నీ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు.
‘‘బన్నీ అన్నా.. నిద్ర లేచే ఉన్నారా?’’ అని విజయ్ అడగ్గా, ‘‘లేచే ఉన్నాను’’ అని అల్లు అర్జున్ సమాధానమిచ్చారు. ఇంత రాత్రి సమయంలో ఫోన్ చేయడానికి గల కారణాన్ని వివరిస్తూ, ఈ సమయంలో కాల్ చేసినా తిట్టకుండా మాట్లాడే వ్యక్తి కోసం ఆలోచించానని, పరిశ్రమలో తనను ప్రేమించే వారిలో అల్లు అర్జున్ గుర్తుకు వచ్చారని విజయ్ తెలిపారు. దీనిపై బన్నీ నవ్వుతూ స్పందిస్తూ, ‘‘పర్వాలేదు.. నువ్వు కాల్ చేయడం చాలా స్వీట్’’ అన్నారు. అనంతరం కరణ్ జోహార్, రష్మిక మందన్నతోనూ మాట్లాడారు. ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!