

మాధవ్ భూపతిరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మారెమ్మ’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ తాజాగా విడుదలైంది. గ్రామంలో పవిత్రంగా భావించే దున్నపోతు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, దాని వెనుక దాగి ఉన్న రహస్యాలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. మారెమ్మ తల్లిపై ప్రజల నమ్మకాలు, గ్రామీణ సంప్రదాయాలు, ఊరి పగలు కథలో ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మాధవ్ తన ఎనర్జిటిక్ మాస్ అవతార్‌తో ఆకట్టుకోగా, అతని పాత్రలో యాక్షన్‌తో పాటు భావోద్వేగ అంశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మాధవ్‌కు జోడీగా దీపా బాలు నటించగా, వినోద్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన రా అండ్ సీరియస్ నేపథ్య సంగీతం ట్రైలర్ తీవ్రతను మరింత పెంచింది. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ కూడా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది. సంప్రదాయ విశ్వాసాలు, ప్రతీకారం, యాక్షన్‌ను మేళవించి దర్శకుడు కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న థియేటర్లలోకి రానున్న ‘మారెమ్మ’కు మాస్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!