
సూర్య, రాధిక, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై విడుదలకు ముందే మంచి బజ్ నెలకొంది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈరోజు ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహిస్తున్నారు. ‘గజిని’లో సంజయ్ రామస్వామిగా మెప్పించిన సూర్య.. ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్‌గా మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది.
ఫస్ట్ హాఫ్‌లో సూర్య, రాధిక, మమిత బైజు మధ్య వచ్చే ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకునేలా ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మమిత బైజు ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తూ తన పాత్రకు చక్కగా సరిపోయింది. సెకండ్ హాఫ్‌లో బలమైన కుటుంబ భావోద్వేగాలతో దర్శకుడు వెంకీ అట్లూరి ఫ్రెష్ ట్రీట్మెంట్ ఇచ్చారని చెబుతున్నారు. ‘లక్కీ భాస్కర్’ తర్వాత వెంకీ అట్లూరి మరో కొత్త కథతో డైలాగ్స్, స్క్రీన్‌ప్లే విషయంలో ఆకట్టుకున్నారని టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉందని, ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమాగా నిలుస్తుందని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!