

విజయదశమి సందర్భంగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’కు వెస్ట్ బెంగాల్లో పన్ను మినహాయింపు కల్పించినట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. సాధారణంగా సినిమాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం ప్రకారం సినిమా టికెట్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందాల్సిన వస్తు, సేవల పన్ను (ఎస్జీఎస్టీ) మినహాయించనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందాల్సిన పన్ను (సీజీఎస్టీ) మాత్రం కొనసాగుతుంది.
ఈ పన్ను మినహాయింపు వల్ల నిర్మాతలకు నేరుగా ఆర్థిక ప్రయోజనం కలగకపోయినా, ప్రేక్షకులకు టికెట్లు కొంత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగి, సినిమా వసూళ్లకు పరోక్షంగా ప్రయోజనం చేకూరవచ్చని సినీ వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ నిర్ణయాన్ని అనుసరించి మరిన్ని రాష్ట్రాలు కూడా ‘రామాయణం’కు పన్ను రాయితీలు కల్పిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!