
జనరల్

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. కుటుంబ భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సంగీత దర్శకుడు థమన్ సంగీత పనుల్లో నిమగ్నమై ఉన్నారని సమాచారం. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మొదట వేసవి సీజన్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ, వివిధ కారణాలతో ప్రణాళిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నేపథ్య సంగీతం, పాటలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్రివిక్రమ్ చిత్రాల్లో చివరి దశలో మార్పులు చేసే సంప్రదాయం ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌లో కూడా అదే విధానం కొనసాగుతున్నట్లు టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!