
జనరల్

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోల పని తీరు గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పాత్రకు చిన్న మార్పులు చేసేవారు కానీ ఇప్పుడు పాత్ర కోసం నెలల తరబడి శిక్షణ తీసుకుంటూ పూర్తిగా ట్రాన్స్ఫర్మ్ అవుతున్నారు. యాక్షన్, చారిత్రక, క్రీడా నేపథ్య చిత్రాల పెరుగుదలతో ఈ ధోరణి మరింత వేగంగా పెరిగింది.
ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభూ’ కోసం వియత్నాంలో కత్తిసాము, విలువిద్యలో శిక్షణ తీసుకుంటుండగా, విజయ్ దేవరకొండ ‘రణబాలి’ కోసం గుర్రపు స్వారీ, యుద్ధ కళలు నేర్చుకుంటున్నాడు. సాయిధరమ్ తేజ్, శర్వానంద్ వంటి నటులు కూడా కొత్త నైపుణ్యాలను అభ్యసిస్తూ పాత్రలకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!