

కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన అక్క వెబ్ సిరీస్ టీజర్ తాజాగా విడుదలైంది. ఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ పేరుతో పలు సినిమాల్లో యాక్షన్, హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో, ఒక హీరోయిన్ను గ్యాంగ్స్టర్గా చూపించే విభిన్న కథాంశంతో ఈ సిరీస్ రూపొందింది. ఇందులో కీర్తి సురేశ్ కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆమె పోషించిన పాత్రలకు భిన్నంగా ఈ క్యారెక్టర్ ఉండబోతోంది. రాధికా ఆప్టే కూడా మరో కీలక పాత్రలో నటించారు.
800 ఏళ్లుగా మహిళలే పాలిస్తున్న పేర్నూర్ అనే కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అలాంటి గ్రామంలోకి ఓ మహిళ వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఆమె రాకతో అక్కడి పరిస్థితులు ఎలా మారాయి? అనే అంశాల చుట్టూ కథ నడుస్తున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. విభిన్నమైన నేపథ్యం, మహిళా ప్రధాన పాత్రలు, గ్యాంగ్స్టర్ కథాంశంతో అక్క సిరీస్ ఆసక్తిని పెంచుతోంది. ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ప్రేక్షకుల కోసం కూడా అందుబాటులో ఉండనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!