

థియేటర్లలో దాదాపు రూ.1,400 కోట్ల వసూళ్లతో సంచలన విజయం సాధించిన 'ధురంధర్' ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అదే జోరును కొనసాగిస్తోంది. 2026 జనవరి నుంచి జూన్ వరకు ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ వ్యూస్ నమోదు చేసి, నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన ఇంగ్లీషేతర చిత్రంగా కొత్త రికార్డు సృష్టించింది. ఈ ఘనతతో భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణ మరోసారి స్పష్టమైంది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో భారత గూఢచారి పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటనకు విశేష ప్రశంసలు లభించాయి. ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. యాక్షన్, దేశభక్తి, భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2026 తొలి ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 97 బిలియన్ గంటల కంటెంట్ వీక్షించబడిందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!