

అజిత్ డోభాల్‌ను పోలిన అజయ్ సన్యాల్ పాత్రలో ‘ధురంధర్’ సినిమాలో మెప్పించిన మాధవన్.. తాజాగా ప్రముఖ ఆవిష్కర్త జి.డి. నాయుడు పాత్రలో ‘GDN’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో దుశారా విజయన్, ప్రియమణి, జయరామ్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు.
కోయంబత్తూరులోని రైతు కుటుంబంలో జన్మించిన జి.డి. నాయుడు మూడో తరగతితోనే చదువును నిలిపివేశారు. అయితే డిగ్రీల కంటే నేర్చుకోవాలనే ఆసక్తి, పరిశీలనా శక్తి ముఖ్యమని నమ్మిన ఆయన యంత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఓ బ్రిటిష్ వ్యక్తి వద్ద మోటార్ సైకిల్‌ను చూసి దానిని కొనుగోలు చేసి, దాని పనితీరును అధ్యయనం చేశారు. ఆ తర్వాత సొంత ఆలోచనలతో వాహనాలను తయారు చేయడంతో పాటు అనేక పరికరాలను రూపొందించారు. భారతదేశంలో తొలి విద్యుత్ మోటార్ తయారీలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన ఎదుగుదలను అడ్డుకునేందుకు బ్రిటిష్ అధికారులు, కొంతమంది పారిశ్రామికవేత్తలు చేసిన ప్రయత్నాలను నాయుడు ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ సినిమా కథ.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!