
జనరల్

థియేటర్లలో విడుదలైన హీ-మ్యాన్: మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రావిస్ నైట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లైవ్ యాక్షన్ ఫాంటసీ యాక్షన్ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్‌లో హీరో పాత్రకు నిఖిల్, ఇతర కీలక పాత్రలకు రావు రమేష్, ఆదిత్య మీనన్ డబ్బింగ్ చెప్పారు.
ఎటర్నియా గ్రహంపై స్కెలిటార్ దాడి చేసిన తర్వాత చిన్నవాడైన ఆడమ్‌ను శక్తివంతమైన ఆయుధంతో భూమికి పంపిస్తారు. కాలక్రమంలో ఆ ఆయుధాన్ని కోల్పోయిన ఆడమ్, తన గతం గురించి తెలుసుకుని మళ్లీ ఎటర్నియాకు చేరుకుంటాడు. తన శక్తులను తిరిగి పొందుతూ హీ-మ్యాన్‌గా మారి, స్కెలిటార్‌తో పోరాడి తన కుటుంబాన్ని, రాజ్యాన్ని ఎలా రక్షించాడనేదే ఈ సినిమా ప్రధాన కథ.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!