
సినిమాలు

ఓటీటీల్లో మలయాళ సినిమాలకు రోజురోజుకూ మంచి ఆదరణ లభిస్తోంది. వినూత్న కథలు, బలమైన కథనంతో రూపొందే ఈ చిత్రాలు ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన ‘చిన్న చిన్న ఆసై’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ఈ సినిమా జూలై 28 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంద్రన్స్, మధు, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!