

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘గజబ్ రాత్’ ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. నీరజ్ పాండే, రితేశ్ షా సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి నెట్ఫ్లిక్స్లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మనోజ్ బాజ్పేయీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ట్రైలర్లోని ఉత్కంఠభరిత సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రానికి మొదట ‘ఘూసఖోర్ పండత్’ అనే టైటిల్ను ఖరారు చేసి, అదే పేరుతో కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు. అయితే, సినిమా టైటిల్తో పాటు కథాంశం, మనోజ్ పాత్ర చిత్రణపై వివాదం తలెత్తింది. తమ వర్గాన్ని కించపరిచేలా టైటిల్, కథాంశం ఉన్నాయని ఆరోపిస్తూ ఓ బ్రాహ్మణ సంఘం దర్శకులపై ఫిర్యాదు చేసి, సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఈ వివాదం నేపథ్యంలో మేకర్స్ టైటిల్ను ‘గజబ్ రాత్’గా మార్చారు. ఈ చిత్రంలో నుష్రత్ భరుచ్చా, సాకిబ్ సలీమ్, దివ్యా దత్తా, కికు శారదా, శ్రద్ధా దాస్ కీలక పాత్రల్లో నటించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!