3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ వారం ఓటీటీలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

Writer: Chandrika 02:14 PM, 3 సెప్టెంబర్, 2026
ఈ వారం ఓటీటీలో  ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో మంచి వినోదం అందనుంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన పలు చిత్రాలు ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదికలపైకి వస్తున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌, రితికా నాయక్‌, సత్య నటించిన కామెడీ హారర్‌ థ్రిల్లర్‌ ‘కొరియన్‌ కనకరాజు’ సెప్టెంబరు 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. లోకేశ్‌ కనగరాజ్‌, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ‘డీసీ’ కూడా అదే రోజు సన్‌నెక్ట్స్‌లో అందుబాటులోకి రానుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రంపై ఓటీటీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మాధవన్‌ కీలక పాత్రలో నటించిన ‘జి.డి.నాయుడు’ సెప్టెంబరు 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ధుషారా విజయన్‌, ప్రియమణి, జయరామ్‌, సత్యరాజ్‌ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అజయ్‌ దేవగణ్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, అర్షద్‌ వార్సీ నటించిన ‘ధమాల్‌ 4’ కూడా సెప్టెంబరు 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. కుంచకో బోబన్‌, లిజోమోల్‌ జోస్‌, రైనా రాధాకృష్ణన్‌, సిద్ధిఖీ నటించిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఉన్మాదం’ సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఇవే కాకుండా వివిధ ఓటీటీ వేదికలపై మరిన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ‘ది రన్నర్‌’ ఇంగ్లిష్‌ చిత్రం, ‘జగమే సంగీతం’ తెలుగు వెబ్‌సిరీస్‌ అందుబాటులోకి వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ‘టర్నింగ్‌ పాయింట్‌: జనరేషన్‌ 9/11’, ‘లవ్‌ సిక్‌’, ‘వదలా’, ‘గాంధారి’, ‘ది జెంటిల్‌మెన్‌: సీజన్‌ 2’, ‘ది ప్రెసిడెంట్స్‌ కేక్‌’ వంటి పలు చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ‘ఎర్లీ మీట్స్‌ వరల్డ్‌’, ‘ఎ మైన్‌క్రాఫ్ట్‌ మూవీ’ సెప్టెంబరు 4న, ‘ది బ్రెడ్‌ విన్నర్‌’ సెప్టెంబరు 6న విడుదల కానున్నాయి. జియో హాట్‌స్టార్‌లో ‘స్టార్‌ వార్స్‌: ది మాండలోరియన్‌ అండ్‌ గ్రోగు’తో పాటు ‘ది కోర్ట్‌’ తమిళ్‌ సిరీస్‌ సెప్టెంబరు 4న రానుంది. జీ5లో ‘వీరభద్ర రహస్యం: సీజన్‌ 1 పార్ట్‌ 2’ అదే రోజు స్ట్రీమింగ్‌ కానుంది. మనోరమా మ్యాక్స్‌లో ‘అనంతన్‌ కాడు’ అందుబాటులో ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ట్యాగ్లు
ఓటీటీ విడుదలలుకొరియన్‌ కనకరాజుడీసీ మూవీజి.డి.నాయుడుధమాల్‌ 4ఉన్మాదంవరుణ్‌ తేజ్‌మాధవన్‌లోకేశ్‌ కనగరాజ్‌ఓటీటీ సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ
సినిమాలు

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

హాట్ వీడియోలపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు...
సినిమాలు

హాట్ వీడియోలపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు...

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సినిమాలు

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..
జనరల్

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..

ఈ వారం ఓటీటీలో  ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌
జనరల్

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..
జనరల్

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!
సినిమాలు

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..
జనరల్

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు
జనరల్

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..
సినిమాలు

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!