

తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో పాటు యూట్యూబ్ వీడియోల ద్వారా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ, వరుస సినీ అవకాశాలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ‘కలివనం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ధనుష్ మేనల్లుడు పవిష్ సరసన ‘లవ్ ఓ లవ్’ సినిమాతో తమిళ చిత్రసీమలో హీరోయిన్‌గా అడుగుపెట్టారు. జూలై 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా, విడుదలైన మూడు వారాల్లోనే జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
తమిళంలో తొలి సినిమా నిరాశపరిచినప్పటికీ నాగదుర్గ తెలుగులో మాత్రం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ప్రియదర్శి సరసన ‘ఇడుపు కాయితం’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌పై వచ్చిన వివాదానికి చిత్రబృందం వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వడంతో ఆ అంశం ముగిసింది. ఇప్పుడు ఈ సినిమా ద్వారా నాగదుర్గ మరో విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!