
జనరల్

భారతీయ కే-డ్రామా అభిమానుల కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తన లైబ్రరీలో ‘గోల్డ్ ల్యాండ్’, ‘ఇన్ యువర్ రేడియంట్ సీజన్’ అనే రెండు కొత్త కొరియన్ సిరీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సిరీస్‌లు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటున్నాయి. కొరియన్‌తో పాటు హిందీ ఆడియో సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
‘గోల్డ్ ల్యాండ్’ సంపద, కుటుంబ రహస్యాలు, మిస్టరీల నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కాగా, ‘ఇన్ యువర్ రేడియంట్ సీజన్’ ప్రేమ, భావోద్వేగాలు, యువత జీవితాల చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా. ప్రతి వారం కొత్త ఎపిసోడ్లు విడుదల కానుండటంతో ఈ సిరీస్‌లపై ఆసక్తి మరింత పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!