

ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ద్వారా 13 కోట్ల ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, వారిలో నిజంగా అర్హులైన ఓటర్లు ఎంత మంది ఉన్నారనే ప్రశ్నకు ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆయన ఒక బ్లాగ్లో ఆ వివరాలను ప్రచురించారు. సర్ ప్రక్రియ ముగిసిన రాష్ట్రాల్లో 70 లక్షల మంది అర్హులైన ఓటర్లను మాత్రమే వివరణ లేకుండా తొలగించి ఉండవచ్చని అన్నారు.
‘సర్ ముగిసిన రాష్ట్రాల్లో 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని ప్రచారం జరుగుతోంది. అయితే, అవి ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్ డిలీషన్లలోనే ఉన్నాయి. అంటే ఆ ఓటర్ల పేర్లను రికార్డుల నుంచి తొలగించాలా వద్దా అన్న ప్రతిపాదన ఉంది. వాటిలో మరణాలు, రీలొకేషన్లు, డూప్లికేషన్ వంటి చట్టబద్ధమైన కారణాలు ఉన్నాయి. అలాగే తుది ఓటరు జాబితాలు ఇంకా పబ్లిష్ కాని రాష్ట్రాలు కూడా అందులో ఉన్నాయి. జనాభా, అధికారిక జనన మరణాల డేటా, సర్కు ముందు జరిగిన రిజిస్ట్రేషన్లు వంటి వివరాల ఆధారంగా 70 లక్షల మంది ఓటర్లను వివరణ లేకుండా తొలగించి ఉండవచ్చు. వివరణ లేకుండా అంటే 70 లక్షల మందిలో ప్రతి ఒక్కరినీ తప్పుగా తొలగించారని కాదు’ అని భల్లా పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!