

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించిన కూటమి నేతలు.. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నారు. ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలి? ఏ స్థానంలో ఎవరిని బరిలోకి దించాలి? అనే అంశాలపై నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ లింగమనేని రమేష్ తదితరులు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూటమి నాయకులు భావిస్తున్నారు. నామినేషన్ల గడువులోగా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసి, ఎన్నికల బరిలో సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!