
సినిమాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దిల్లీలో నిరసనలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తావిస్తూ రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
‘‘మీరు విదేశాల్లో ఉండటంతో నా మాటలు వినలేరని నాకు తెలుసు. మీరు ఎందుకు విదేశాలకు వెళ్తారో చెప్పరు. అది మీ వ్యక్తిగత విషయం. అయితే, దిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత నా మాటలు వినండి. మరో 30 ఏళ్ల వరకు మీరు అధికారంలోకి రారు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ విదేశీ పర్యటనను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!