
బిజినెస్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవుల కోసం మొత్తం 1,038 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి అత్యధికంగా 319 నామినేషన్లు దాఖలవగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి 283 నామినేషన్లు వచ్చాయి.
జనసేన పార్టీ తరఫున 91, బీజేపీ నుంచి 21, కాంగ్రెస్ పార్టీ నుంచి 81 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, 175 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు. చైర్‌పర్సన్ పదవులతో పాటు వార్డు స్థానాలకు కలిపి మొత్తం 3,020 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. ఈ నామినేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!