

ఆంధ్రప్రదేశ్‌లో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ZPTC) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే భారీ స్పందన కనిపించింది. అందిన గణాంకాల ప్రకారం, MPTC స్థానాలకు 5,267 నామినేషన్లు, ZPTC స్థానాలకు 409 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 MPTC స్థానాలు, 659 ZPTC స్థానాలు ఉన్నాయి.
MPTC స్థానాలకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అత్యధికంగా 2,719 నామినేషన్లు దాఖలు చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) 1,918 నామినేషన్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. జనసేన 294, బీజేపీ 74 నామినేషన్లు దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 172 నామినేషన్లు వచ్చాయి. ZPTC స్థానాలకు వైసీపీ 192, టీడీపీ 128, బీజేపీ 24, జనసేన 21, కాంగ్రెస్ 17 నామినేషన్లు దాఖలు చేశాయి. నామినేషన్ల తొలి రోజు గణాంకాలు రాష్ట్రంలో ఎన్నికల పోటీపై ఆసక్తిని పెంచుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!