30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

Writer: Pooja 04:37 PM, 30 ఆగస్టు, 2026
రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

మేడ్చల్‌-మల్కాజిగిరి అర్బన్‌ జిల్లా బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవం, నూతన జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. పార్టీ ఇప్పటికే గిరివర్ధన్‌ రెడ్డిని మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, సిద్ధాంతాల ఆధారంగా దేశహితం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గిరివర్ధన్‌ రెడ్డి చురుకుగా పనిచేశారని, కార్యకర్తలే పార్టీకి పునాదులని పేర్కొన్నారు. నాయకులు ప్రజలు, కార్యకర్తలతో అనుసంధానంగా ఉండాలని, బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ భద్రత, ప్రజాస్వామ్యానికి బలం పెరిగిందని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ఈటల, రామచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా వివరించడం లేదని ఈటల ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం యువత, విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని రామచందర్‌రావు విమర్శించారు. రియల్‌ ఎస్టేట్‌, డ్రగ్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉద్యోగాల అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 22-ఎ భూముల అంశంపై సిట్టింగ్‌ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 5న ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

ట్యాగ్లు
ఈటల రాజేందర్ఎన్ రామచందర్ రావుగిరివర్ధన్ రెడ్డితెలంగాణ బీజేపీరేవంత్ రెడ్డి ప్రభుత్వం22ఎ భూముల అంశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు
గాసిప్స్

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు
జనరల్

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం
గాసిప్స్

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌
సినిమాలు

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ
షోస్

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం
జనరల్

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌
జనరల్

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు
క్రీడలు

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!