

తెలంగాణ శాసనమండలిలోని పట్టభద్రుల నియోజకవర్గాలకు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్, హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులు నవంబర్ 6లోగా నమోదు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వద్దిరాజు రవిచంద్రను నియమించారు. పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేసేందుకు నిరుద్యోగ యువత, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వైద్యులు, అధ్యాపకులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, పాత్రికేయులు, న్యాయవాదులు, ఎల్ఐసీ ఏజెంట్లను పార్టీ శ్రేణులు నేరుగా కలవాలని రవిచంద్ర సూచించారు. ఓటరు నమోదుతో పాటు, కేసీఆర్ పదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించాలని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వైఖరిని కూడా ప్రజలకు తెలియజేయాలని కోరారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!