
క్రీడలు

హైకమాండ్ నిర్ణయంపై డా. జి. చిన్నారెడ్డి స్పందిస్తూ తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. తనకు ప్లానింగ్ కమిషన్ పదవిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగించేలా ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని కలిసేందుకు తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని చెప్పారు. పదవి ఉన్నా లేకున్నా తన గౌరవం తనకుంటుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
పదవిలో ఉన్న సమయంలో కూడా ప్రొటోకాల్‌ను వదులుకున్నానని, వ్యక్తిగత గౌరవం పదవులతో ముడిపడి ఉండదని ఆయన అన్నారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెబుతూ, తనకు పదవుల కంటే ప్రజాసేవే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిపారు. చిన్నారెడ్డి తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!