
గాసిప్స్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే ఆశావహులకు పార్టీ ఆహ్వానం పలికింది. మేయర్, కార్పొరేటర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ తదితర పదవులకు పోటీ చేయాలనుకునే వారు పార్టీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. ఇందుకోసం jsplocalbodyelections.com వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది.
అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం తుది ఎంపికపై జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని పార్టీ తెలిపింది. ప్రజాసేవలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న ఆశావహులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!