
జనరల్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లిలోని తన నివాసంలో మంగళవారం దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వాహన పూజ, ఆయుధ పూజలు చేశారు. దసరా సంప్రదాయాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న శమీ వృక్షానికి కూడా కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో కేసీఆర్ భార్య శోభ, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆయన భార్య శైలిమ, కుమారుడు హిమాన్షు రావుతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కార్యక్రమానికి హాజరైన వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకుల సమక్షంలో సంప్రదాయ పూజలతో దసరా వేడుకలు నిర్వహించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!