26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణను ఏటీఎంగా మార్చారు.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

Writer: Shivani K 07:07 AM, 26 అక్టోబర్, 2026
తెలంగాణను ఏటీఎంగా మార్చారు.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

తెలంగాణను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఏటీఎంగా మార్చుకున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏటీఎం కార్డులా మారారని భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికల సమయంలో 420 హామీలతో ప్రజలను నమ్మించిన రాహుల్‌గాంధీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై స్పందించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నాయకుడు జిబ్రాన్‌ షరీఫ్‌ కేటీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో సమావేశమై ఇచ్చిన హామీలను రాహుల్‌గాంధీ గుర్తు చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై ఆయన మౌనం వహించడానికి కారణమేంటని ప్రశ్నించారు. సీఎం కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములు, వ్యాపార ఒప్పందాలపై వస్తున్న ఆరోపణలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని, రూ.వెయ్యి కోట్ల వ్యాపార ఒప్పందం వెనుక ఉన్న వివరాలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా అక్రమ కేసులతో బెదిరిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కేంద్రంలోని భాజపా ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని విమర్శించారు. 2028లో కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన పలువురు యువ న్యాయవాదులు ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టభద్రుల ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఎన్నికల్లో భారాస అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వారిని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్షణికావేశంలో తొందరపడ్డా.. తప్పును సరిదిద్దుకుంటా: జక్కంపూడి రాజా

క్షణికావేశంలో తొందరపడ్డా.. తప్పును సరిదిద్దుకుంటా: జక్కంపూడి రాజా

ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలు.. మండిపడుతున్న బీజేపీ

ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలు.. మండిపడుతున్న బీజేపీ

రాహుల్ గాంధీ ఓ ‘లాపతా నేత’.. తెలంగాణ హామీలు ఏమయ్యాయంటూ కేటీఆర్ ప్రశ్నలు

రాహుల్ గాంధీ ఓ ‘లాపతా నేత’.. తెలంగాణ హామీలు ఏమయ్యాయంటూ కేటీఆర్ ప్రశ్నలు

చెన్నైలో 3 వేల మంది మహిళా అభిమానులతో ధనుష్ భేటీ..

చెన్నైలో 3 వేల మంది మహిళా అభిమానులతో ధనుష్ భేటీ..

సేవ్ ఇండియా కార్యక్రమ రివ్యూ లో తెలంగాణ నుంచి ముగ్గురు నేతలకు ఛాన్స్

సేవ్ ఇండియా కార్యక్రమ రివ్యూ లో తెలంగాణ నుంచి ముగ్గురు నేతలకు ఛాన్స్

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్ భేటీ

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్ భేటీ

ట్యాగ్లు
కేటీఆర్‌భారాసరాహుల్‌గాంధీరేవంత్‌రెడ్డితెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్‌ ప్రభుత్వంఆరు గ్యారంటీలుఎన్నికల హామీలుకేసీఆర్‌తెలంగాణ భవన్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి
జనరల్

నేడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

తుఫాన్‌ ప్రభావం.. పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్‌
జనరల్

తుఫాన్‌ ప్రభావం.. పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్‌

అల్లం తులసి టీతో జలుబు, దగ్గు తగ్గుతాయా? వైద్యులు సూచిస్తున్న విషయాలు తెలుసుకోండి
ఆరోగ్యం

అల్లం తులసి టీతో జలుబు, దగ్గు తగ్గుతాయా? వైద్యులు సూచిస్తున్న విషయాలు తెలుసుకోండి

చల్లటి నీటితో తలస్నానం చేస్తే జలుబు వస్తుందా? వైద్యులు ఏమంటున్నారంటే!
ఆరోగ్యం

చల్లటి నీటితో తలస్నానం చేస్తే జలుబు వస్తుందా? వైద్యులు ఏమంటున్నారంటే!

ఐసెన్‌కోట్‌ వర్సెస్‌ నెతన్యాహు.. ఇజ్రాయెల్‌ ప్రధాని పీఠంపై ఆసక్తికర పోరు
జనరల్

ఐసెన్‌కోట్‌ వర్సెస్‌ నెతన్యాహు.. ఇజ్రాయెల్‌ ప్రధాని పీఠంపై ఆసక్తికర పోరు

జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రభుత్వానికి అతి విధేయత చూపేవారు.. సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సంచలన వ్యాఖ్యలు
జనరల్

జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రభుత్వానికి అతి విధేయత చూపేవారు.. సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సంచలన వ్యాఖ్యలు

క్షణికావేశంలో తొందరపడ్డా.. తప్పును సరిదిద్దుకుంటా: జక్కంపూడి రాజా
రాజకీయాలు

క్షణికావేశంలో తొందరపడ్డా.. తప్పును సరిదిద్దుకుంటా: జక్కంపూడి రాజా

గగనతల రక్షణకు మరింత బలం.. ఐఏఎఫ్‌ భవిష్యత్‌ ప్రణాళికపై ఏపీ సింగ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

గగనతల రక్షణకు మరింత బలం.. ఐఏఎఫ్‌ భవిష్యత్‌ ప్రణాళికపై ఏపీ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

స్వయం సమృద్ధ భారత్‌ లక్ష్యానికి స్థానిక ఉత్పత్తులే బలం.. మోదీ సూచన
జనరల్

స్వయం సమృద్ధ భారత్‌ లక్ష్యానికి స్థానిక ఉత్పత్తులే బలం.. మోదీ సూచన

తెలంగాణను ఏటీఎంగా మార్చారు.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

తెలంగాణను ఏటీఎంగా మార్చారు.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ఎల్‌నినో ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. రైతులు రెండో పంట వేయొద్దు: పొంగులేటి
జనరల్

ఎల్‌నినో ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. రైతులు రెండో పంట వేయొద్దు: పొంగులేటి

కొరియా సంస్థలతో భాగస్వామ్యానికి తెలంగాణ సిద్ధం.. కీలక రంగాలపై దృష్టి
జనరల్

కొరియా సంస్థలతో భాగస్వామ్యానికి తెలంగాణ సిద్ధం.. కీలక రంగాలపై దృష్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!