26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..

Writer: Chandrika 03:36 PM, 26 అక్టోబర్, 2026
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..

మహారాష్ట్రకు ప్రతికూల ప్రభావం ఉండకపోతే తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి గతంలో కుదిరిన ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు తమకు అభ్యంతరం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. తెలంగాణ నీటి అవసరాలకు సహకరిస్తామని పేర్కొంటూ, కేంద్ర జలసంఘం అధ్యయనంతో పాటు రెండు రాష్ట్రాల అధికారులతో కూడిన సంయుక్త కమిటీ అన్ని అంశాలను పరిశీలించాలని ప్రతిపాదించారు. ముంపు ప్రభావం, ప్రభావిత ప్రాంతాలు, సాంకేతిక అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరమని సూచించారు. ముంబైలోని సహ్యాద్రి స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం ఫడణవీస్‌తో సమావేశమైంది. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచడం, నీటి లభ్యత, ముంపు సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలపై చర్చించారు.

తెలంగాణ నీటి అవసరాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి సహకరించాలని రేవంత్‌ రెడ్డి మహారాష్ట్రను కోరారు. 2016లో కుదిరిన ఒప్పందం ప్రకారం బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయించారని, ఆ ఎత్తుతో తెలంగాణ తాగునీరు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరకపోవచ్చని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలు, ప్రాజెక్టు నిర్వహణ వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు అక్కడి భూసేకరణ నిబంధనలు, పరిహార విధానం ప్రకారం నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ఫడణవీస్‌.. తుది నిర్ణయానికి ముందు సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. తదుపరి సమావేశాలు, వాటి కాలపరిమితులను నిర్ణయించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోదావరి జలాలపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్

గోదావరి జలాలపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్

ధనుష్ రాజకీయ ప్రవేశం.. కమలం గుర్తుపై దుమారం

ధనుష్ రాజకీయ ప్రవేశం.. కమలం గుర్తుపై దుమారం

స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా కూటమి జెండా ఎగరాలి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా కూటమి జెండా ఎగరాలి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా

యలహంక భూమి షర్మిలదే.. విజయమ్మ పాత ప్రకటన మళ్లీ వైరల్‌!

యలహంక భూమి షర్మిలదే.. విజయమ్మ పాత ప్రకటన మళ్లీ వైరల్‌!

కడప జిల్లాలో కూటమి హవా..

కడప జిల్లాలో కూటమి హవా..

ట్యాగ్లు
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుదేవేంద్ర ఫడణవీస్‌రేవంత్‌ రెడ్డితెలంగాణ సాగునీరుమహారాష్ట్ర ప్రభుత్వంఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికేంద్ర జలసంఘంజలవనరుల పంపకంగిరిజన సంక్షేమంనీటిపారుదల ప్రాజెక్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 ‘ఓటు చోరీ’ నిరసన వాయిదా వేయాలని వ్యాపారుల విజ్ఞప్తి.. రాహుల్‌ గాంధీ ఏమన్నారంటే?
రాజకీయాలు

‘ఓటు చోరీ’ నిరసన వాయిదా వేయాలని వ్యాపారుల విజ్ఞప్తి.. రాహుల్‌ గాంధీ ఏమన్నారంటే?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్

యూపీఐ చెల్లింపులపై అదనపు రుసుముల ప్రతిపాదన.. హైదరాబాద్ వ్యాపారుల్లో ఆందోళన
బిజినెస్

యూపీఐ చెల్లింపులపై అదనపు రుసుముల ప్రతిపాదన.. హైదరాబాద్ వ్యాపారుల్లో ఆందోళన

హైదరాబాద్ హనీ ట్రాప్ కేసులో కీలక విషయాలు
జనరల్

హైదరాబాద్ హనీ ట్రాప్ కేసులో కీలక విషయాలు

పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్‌ సరఫరా?
జనరల్

పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్‌ సరఫరా?

ఉగాండాలో తితిదే ఆధ్యాత్మిక కార్యక్రమం.. మూడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు
జనరల్

ఉగాండాలో తితిదే ఆధ్యాత్మిక కార్యక్రమం.. మూడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు

‘రణబాలి’ నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల..
సినిమాలు

‘రణబాలి’ నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల..

విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు

హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల.. ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ
బిజినెస్

హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల.. ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..
రాజకీయాలు

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..

పాక్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్ చరిత్ర
క్రీడలు

పాక్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్ చరిత్ర

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ
జనరల్

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!