

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 28 మంది ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. ఎన్నికల కోడ్ అమలును నిరంతరం పర్యవేక్షించాలని, రాజకీయ ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా పరిశీలకులకు సూచించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు, జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పరిశీలకులకు సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!