

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఎలాంటి సెక్యూరిటీ, కాన్వాయ్ లేకుండా ఆయన ఒంటరిగా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ భేటీకి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఈ సమావేశంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!