19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓట్ల చోరీ వెనుక మోదీ, అమిత్‌ షా ఉన్నారంటూ రాహుల్‌ గాంధీ ఆరోపణలు

Writer: Nithish 06:50 AM, 19 అక్టోబర్, 2026
ఓట్ల చోరీ వెనుక మోదీ, అమిత్‌ షా ఉన్నారంటూ రాహుల్‌ గాంధీ ఆరోపణలు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశంలో ఓట్ల చోరీకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళిక రూపొందించారని, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దాన్ని అమలు చేయగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ కార్యరూపంలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సంబంధిత నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. ఆదివారం దక్షిణ గోవాలోని మార్గావ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. తనపై 45కు పైగా పరువు నష్టం కేసులు ఉన్నాయని, అయితే ఓట్ల చోరీ ఆరోపణలపై మాత్రం కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. అలాంటి కేసు నమోదైతే అది పూర్తిస్థాయి చట్టపరమైన వ్యవహారంగా మారుతుందనే భయంతోనే వెనుకడుగు వేస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. ‘గోవా రక్షణ యాత్ర’లో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన సుమారు రెండు కిలోమీటర్లు నడిచారు.

మరోవైపు, భారత్‌లో ఫ్రాన్స్‌, బంగ్లాదేశ్‌ తరహా హింసను సృష్టించేందుకు దేశ వ్యతిరేక శక్తులతో పాటు కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఆరోపించారు. యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. ఫ్రాన్స్‌, బంగ్లాదేశ్‌లలో జరిగిన పరిణామాలను భారత్‌లో పునరావృతం చేయాలనే ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రభుత్వ మార్పు సాధ్యమేనని, అయితే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారానే జరగాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కడప జిల్లాలో వైకాపాకు నామినేషన్ల షాక్

కడప జిల్లాలో వైకాపాకు నామినేషన్ల షాక్

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

ట్యాగ్లు
రాహుల్ గాంధీనరేంద్ర మోదీఅమిత్ షాఓట్ల చోరీ ఆరోపణలుకాంగ్రెస్ పార్టీగోవా రక్షణ యాత్రకిరణ్ రిజిజుఎన్నికల సంఘంరాజకీయ వివాదందేశ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీపావళి తర్వాత వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం
బిజినెస్

దీపావళి తర్వాత వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం

బీసీసీఐ సెలక్టర్‌ పదవికి పార్థివ్‌ పటేల్‌ దూరం.
క్రీడలు

బీసీసీఐ సెలక్టర్‌ పదవికి పార్థివ్‌ పటేల్‌ దూరం.

ముంబయిలో టైగర్‌ ష్రాఫ్‌ వాహనంపై కాల్పులు
జనరల్

ముంబయిలో టైగర్‌ ష్రాఫ్‌ వాహనంపై కాల్పులు

లంచం కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెక్షన్‌ 17(ఎ) రక్షణ వర్తించదు: సుప్రీంకోర్టు
జనరల్

లంచం కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెక్షన్‌ 17(ఎ) రక్షణ వర్తించదు: సుప్రీంకోర్టు

అంగారకుడి చందమామ ఫోబోస్‌ నుంచి నమూనాలు తెచ్చేందుకు జపాన్‌ మిషన్‌
జనరల్

అంగారకుడి చందమామ ఫోబోస్‌ నుంచి నమూనాలు తెచ్చేందుకు జపాన్‌ మిషన్‌

రష్యా చమురు ఎగుమతి స్థావరంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
జనరల్

రష్యా చమురు ఎగుమతి స్థావరంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు

ఓట్ల చోరీ వెనుక మోదీ, అమిత్‌ షా ఉన్నారంటూ రాహుల్‌ గాంధీ ఆరోపణలు
రాజకీయాలు

ఓట్ల చోరీ వెనుక మోదీ, అమిత్‌ షా ఉన్నారంటూ రాహుల్‌ గాంధీ ఆరోపణలు

ఎల్‌నినో ప్రభావంతో మత్స్య సంపదకు ముప్పు
జనరల్

ఎల్‌నినో ప్రభావంతో మత్స్య సంపదకు ముప్పు

కడప జిల్లాలో వైకాపాకు నామినేషన్ల షాక్
రాజకీయాలు

కడప జిల్లాలో వైకాపాకు నామినేషన్ల షాక్

తమిళనాడులో ప్రకృతి విపత్తుల ప్రమాదం.. సీడీఆర్‌ఐ నివేదిక హెచ్చరిక
జనరల్

తమిళనాడులో ప్రకృతి విపత్తుల ప్రమాదం.. సీడీఆర్‌ఐ నివేదిక హెచ్చరిక

వైకాపా అధికారంపై అంబటి ధీమా.. పోలీసుల ముందు కీలక వ్యాఖ్యలు
జనరల్

వైకాపా అధికారంపై అంబటి ధీమా.. పోలీసుల ముందు కీలక వ్యాఖ్యలు

దసరా రద్దీ వేళ రైళ్లలో జనరల్ బోగీల కొరత
జనరల్

దసరా రద్దీ వేళ రైళ్లలో జనరల్ బోగీల కొరత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!