17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌

Writer: Pooja 06:47 AM, 17 అక్టోబర్, 2026
బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రాజకీయంగా నిధులు సమకూర్చాల్సి వస్తుందనే భయంతో ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్లలో కమీషన్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నర్సంపేట నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ హైకమాండ్‌కు డబ్బులు పంపకపోతే ముఖ్యమంత్రి పదవి కొనసాగదనే భయంతో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విదేశీ బొగ్గు కొనుగోళ్ల వ్యవహారంతో పాటు, సింగరేణిలో తన బావమరిది ప్రమేయం ఉందని తాము ఆరోపిస్తున్న రూ.10 వేల కోట్ల కుంభకోణంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్‌ విసిరారు. సింగరేణిలో సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలను కూడా బయటపెడతామని అన్నారు. బొగ్గు ఉత్పత్తి తగ్గడం వల్లే విద్యుత్‌ కేంద్రాల్లో కొరత ఏర్పడిందని, సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టి సంస్థను బదనాం చేస్తున్నారని ఆరోపించారు.

సాగునీరు, కరువు పరిస్థితులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని కేటీఆర్‌ విమర్శించారు. దాదాపు వెయ్యి టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేశారని ఆరోపిస్తూ, ఎల్‌నినో ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రభుత్వాలు నీటి నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నీటి వనరుల నిర్వహణపై కార్యక్రమాలు జరుగుతుండగా, తెలంగాణలో కరువు పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్ష మేరకు బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటు హక్కు కల్పించేలా ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికలకు పారా మిలటరీ భద్రత అవసరం - జగన్

స్థానిక ఎన్నికలకు పారా మిలటరీ భద్రత అవసరం - జగన్

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్రేవంత్‌రెడ్డిసింగరేణితెలంగాణ రాజకీయాలుపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
జనరల్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా
జనరల్

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు
క్రీడలు

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు

డెంగ్యూలో ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు
ఆరోగ్యం

డెంగ్యూలో ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు

ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌
రాజకీయాలు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ
జనరల్

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌
బిజినెస్

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!
జనరల్

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
జనరల్

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ
జనరల్

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ
జనరల్

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!