22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కరువు పరిస్థితుల్లో రేవంత్‌ ప్రభుత్వం విఫలం.. హరీశ్‌ రావు తీవ్ర విమర్శలు

Writer: Shivani K 03:18 PM, 22 అక్టోబర్, 2026
కరువు పరిస్థితుల్లో రేవంత్‌ ప్రభుత్వం విఫలం.. హరీశ్‌ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు విమర్శించారు. గజ్వేల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కాలం తెచ్చిన కరువు కాదని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పది నెలల ముందే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ముఖ్యంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలు తాగునీరు, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌ రావు అన్నారు. ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కరువు మండలాలను ప్రకటించి, రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయని, తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం నిధులు విడుదల చేస్తున్నాయని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కరువు మండలాలను ప్రకటించలేదని, రైతులకు తక్షణ సాయం అందించలేదని విమర్శించారు. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాల విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడంతో పాటు తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ సరఫరాపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు

కొండపోచమ్మ సాగర్ నీటి మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేయాలి: ఎంపీ చామల

కొండపోచమ్మ సాగర్ నీటి మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేయాలి: ఎంపీ చామల

గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కవిత రణభేరి.. రేపు కీలక సమావేశం

గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కవిత రణభేరి.. రేపు కీలక సమావేశం

రాహుల్‌ గాంధీకి అమిత్‌ షా సవాల్‌.. కాంగ్రెస్‌ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు

రాహుల్‌ గాంధీకి అమిత్‌ షా సవాల్‌.. కాంగ్రెస్‌ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు

ప్రొద్దుటూరులో వేడెక్కిన రాజకీయం.. రాచమల్లు వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆగ్రహం

ప్రొద్దుటూరులో వేడెక్కిన రాజకీయం.. రాచమల్లు వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆగ్రహం

ట్యాగ్లు
హరీశ్ రావురేవంత్ రెడ్డితెలంగాణ కరువుబీఆర్ఎస్కాంగ్రెస్ ప్రభుత్వంరైతుల సమస్యలుపంట నష్టంపత్తి దిగుబడిఎల్‌నినోసాగునీటి కొరత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు
జనరల్

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
బిజినెస్

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు
జనరల్

కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు

‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రత్యేక పోస్ట్..
సినిమాలు

‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రత్యేక పోస్ట్..

బిగ్‌బాస్ తెలుగు 10: బల ప్రదర్శన టాస్క్‌లో కుప్పకూలిన వర్షిణి
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బల ప్రదర్శన టాస్క్‌లో కుప్పకూలిన వర్షిణి

రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం
జనరల్

రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం

చొక్కా నలగకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం రజినీకే సాధ్యం.. అల్లు అర్జున్ కామెంట్స్
సినిమాలు

చొక్కా నలగకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం రజినీకే సాధ్యం.. అల్లు అర్జున్ కామెంట్స్

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స
రాజకీయాలు

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స

అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై కేరళ అమ్మాయి మెరుపులు..
జనరల్

అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై కేరళ అమ్మాయి మెరుపులు..

గల్ఫ్ ఆఫ్ అమెరికా తర్వాత అట్లాంటిక్‌పై ట్రంప్ కన్ను
జనరల్

గల్ఫ్ ఆఫ్ అమెరికా తర్వాత అట్లాంటిక్‌పై ట్రంప్ కన్ను

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు
రాజకీయాలు

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శీతల్‌ దేవికి స్వర్ణం
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శీతల్‌ దేవికి స్వర్ణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!