
సినిమాలు

అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి తమ వ్యతిరేకతను వ్యక్తం చేయాలని సంఘాలు నిర్ణయించినట్లు సమాచారం.
మరోవైపు కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి ఎస్సీ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఫామ్‌హౌస్ ఎదుట డప్పులతో నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తాతా మధు వ్యాఖ్యలపై మొదలైన ఈ నిరసనలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!