

తెలంగాణ రక్షణ సేన తరఫున వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను అభ్యర్థిగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దసరా పండుగ సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తెలంగాణ రక్షణ సేన స్థాపించిన తర్వాత శాసన మండలి ఎన్నికల బరిలో పార్టీ తరఫున పోటీ చేయనున్న తొలి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్ పేరు ఖరారు చేశారు. ఈ ఎన్నికల సమన్వయం కోసం సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను పార్టీ రాష్ట్ర పరిశీలకుడిగా, ఎన్నికల కోఆర్డినేటర్‌గా నియమించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన శ్రీకాంత్ గౌడ్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన, తెలంగాణ జాగృతి ప్రారంభం నుంచీ కల్వకుంట్ల కవితతో కలిసి పనిచేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా టెలివిజన్ చర్చలు, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ తరఫున తన వాణిని వినిపించారు. తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్థిగా ఆయనను ప్రకటించడం పార్టీ రాజకీయ ప్రస్థానంలో కీలక పరిణామంగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!