19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రోడ్డు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి: పవన్ కల్యాణ్

Writer: Shivani K 04:29 PM, 19 అక్టోబర్, 2026
రోడ్డు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి: పవన్ కల్యాణ్

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలోని అనంతసముద్రం నుంచి పాపక్కగారిపల్లెకు వెళ్లే బీటీ రోడ్డును వైకాపా నాయకులు ధ్వంసం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల క్రితం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.4.75 కోట్లతో నిర్మించిన ఈ రోడ్డును సుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి కలిసి ట్రాక్టర్‌తో సుమారు 100 మీటర్ల మేర దున్నేసినట్లు అధికారులు వివరించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.

ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో నిందితులపై బెయిల్ పొందడం కష్టతరమయ్యే చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనకు పాల్పడిన వారితో పాటు, వారి వెనుక ఉండి ప్రోత్సహించిన వారిని కూడా గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని అధికారులకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు

ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు

నర్సీపట్నం జనసేనలో కీలక మార్పులు..

నర్సీపట్నం జనసేనలో కీలక మార్పులు..

శాంతియుత నిరసనలనే నమ్ముతాం - శశి థరూర్

శాంతియుత నిరసనలనే నమ్ముతాం - శశి థరూర్

కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారా? ముగ్గురు కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నోటీసులు

కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారా? ముగ్గురు కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నోటీసులు

ధారాపురం, మధురాంతకానికి విజయ్ భారీ వరాలు.. తాగునీరు, విద్య, వైద్యానికి ప్రత్యేక నిధులు

ధారాపురం, మధురాంతకానికి విజయ్ భారీ వరాలు.. తాగునీరు, విద్య, వైద్యానికి ప్రత్యేక నిధులు

రౌడీయిజాన్ని సహించేది లేదు - చంద్రబాబు

రౌడీయిజాన్ని సహించేది లేదు - చంద్రబాబు

ట్యాగ్లు
పవన్ కల్యాణ్తిరుపతి జిల్లాపుల్లంపేటవైకాపా నాయకులుప్రభుత్వ రహదారి ధ్వంసంపంచాయతీరాజ్ శాఖగ్రామీణాభివృద్ధిపల్లె పండుగఎఫ్‌ఐఆర్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గరివిడి లక్ష్మి’ పాటలోని పదాల అర్థం తెలుసా?
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’ పాటలోని పదాల అర్థం తెలుసా?

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపర్ల సంపదకు గండి
బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపర్ల సంపదకు గండి

రామ్ చరణ్–సుకుమార్ సినిమా ప్రారంభోత్సవం వాయిదా?
గాసిప్స్

రామ్ చరణ్–సుకుమార్ సినిమా ప్రారంభోత్సవం వాయిదా?

దిల్ రాజు చేతికి రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ పంపిణీ బాధ్యతలు
గాసిప్స్

దిల్ రాజు చేతికి రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ పంపిణీ బాధ్యతలు

ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హేన్స్‌పై కారు దాడి
జనరల్

ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హేన్స్‌పై కారు దాడి

ధ్రువ్ రాఠీ అరెస్ట్ అంటూ తప్పుడు ప్రచారం.. ఇద్దరిపై నోయిడా పోలీసుల కేసు
జనరల్

ధ్రువ్ రాఠీ అరెస్ట్ అంటూ తప్పుడు ప్రచారం.. ఇద్దరిపై నోయిడా పోలీసుల కేసు

ప్రాసెస్ చేసిన ఆహారాలతో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా?
ఆరోగ్యం

ప్రాసెస్ చేసిన ఆహారాలతో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా?

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌లో ఎనిమిది మంది ప్రముఖులు..
జనరల్

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌లో ఎనిమిది మంది ప్రముఖులు..

రోడ్డు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి: పవన్ కల్యాణ్
రాజకీయాలు

రోడ్డు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి: పవన్ కల్యాణ్

అమెరికాలో భారతీయ కుటుంబాలకు ఆర్థిక కష్టాలు
జనరల్

అమెరికాలో భారతీయ కుటుంబాలకు ఆర్థిక కష్టాలు

జైలు జీవితం గురించి ఉమర్ ఖలీద్ భావోద్వేగ సందేశం
జనరల్

జైలు జీవితం గురించి ఉమర్ ఖలీద్ భావోద్వేగ సందేశం

భారత్‌, చైనాకు అదనపు సుంకాలు విధించాల్సిందే - బెసెంట్‌
జనరల్

భారత్‌, చైనాకు అదనపు సుంకాలు విధించాల్సిందే - బెసెంట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!