24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

Writer: Nithish 01:42 PM, 24 అక్టోబర్, 2026
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తలసాని శ్రీనివాస యాదవ్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 23 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. గత ఎన్నికల్లో ఓటు వేసిన పట్టభద్రులు మళ్లీ ఎందుకు నమోదు చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఓటర్ల నమోదులో ఉన్న ఇబ్బందులను తొలగించి ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రేపు, ఎల్లుండి నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని, సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ను కలిసి సమస్యలను వివరిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు, సాగునీటి సమస్యలపై కూడా తలసాని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవాలని, అవసరమైతే ప్రతిపక్షాల సలహాలు తీసుకోవాలని సూచించారు. కేసీఆర్‌ హయాంలో విద్యుత్, తాగునీరు, సాగునీటి సరఫరా ఎలా ఉండేదో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బీఆర్ఎస్‌ను పదేపదే ప్రస్తావిస్తోందంటే తమ పార్టీపై భయం ఉందని విమర్శించారు. ప్రస్తుత పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొంటూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు వాణీదేవి, దాసోజు శ్రవణ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు క్రిశాంక్, గజ్జల నగేష్, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్

యూపీలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ ఫోకస్

యూపీలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ ఫోకస్

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు -  కేంద్ర మంత్రి  పీయూష్ గోయల్

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు - కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

రాహుల్‌ గాంధీపై సుధాంశు త్రివేది ఘాటు విమర్శలు

రాహుల్‌ గాంధీపై సుధాంశు త్రివేది ఘాటు విమర్శలు

స్టాలిన్‌, చంద్రబాబు, మమతా బెనర్జీలకు రాజకీయ సలహాదారుగా పనిచేశా: మంత్రి కీర్తన

స్టాలిన్‌, చంద్రబాబు, మమతా బెనర్జీలకు రాజకీయ సలహాదారుగా పనిచేశా: మంత్రి కీర్తన

ట్యాగ్లు
తలసాని శ్రీనివాస యాదవ్బీఆర్ఎస్ఎమ్మెల్సీ ఎన్నికలుఓటర్ల నమోదుపట్టభద్రుల ఓటర్లుతెలంగాణ భవన్కాంగ్రెస్ ప్రభుత్వంవిద్యుత్ సమస్యలుతాగునీటి సమస్యలుకేసీఆర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం
జనరల్

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ
బిజినెస్

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు
జనరల్

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం
జనరల్

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!
జనరల్

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు
జనరల్

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్
జనరల్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్
జనరల్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
జనరల్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్
రాజకీయాలు

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!