
రాజకీయాలు

తమిళనాడు అధికార కూటమికి అధికారికంగా పేరు ప్రకటించారు సీఎం విజయ్. చెన్నైలోని టీవీకే కార్యాలయంలో బుధవారం జరిగిన మిత్రపక్షాల సమావేశంలో అధికార కూటమికి ‘లౌకిక సామాజిక న్యాయ విజయ కూటమి’ (ఎస్ఎస్‌జేవీఏ)గా పేరు ఖరారు చేశారు. కూటమిలో ప్రధాన పార్టీగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఉండగా, కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీల ప్రతినిధులు కూటమి పేరును ఏకగ్రీవంగా ప్రకటించారు.
తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే, దాని మిత్రపక్షాలు ఇప్పటివరకు అధికారిక పేరు లేకుండానే కొనసాగుతున్నాయి. లౌకికవాదం, సామాజిక న్యాయం వంటి రాజకీయ విలువలను ప్రతిబింబించేలా ‘లౌకిక సామాజిక న్యాయ విజయ కూటమి’ పేరును కూటమి నేతలు ఖరారు చేశారు. మిత్రపక్షాల సమన్వయంతో ఈ కూటమి ముందుకు సాగనుందని నేతలు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!