
ఓటీటీ

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశం కానున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి 7 గంటలకు హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరి, అక్కడే రాత్రి బస చేయనున్నారు.
రేపు ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. ఈ సమావేశంలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ చర్చల్లో పాల్గొననున్నారు. సమావేశం అనంతరం ప్రాజెక్టుపై తీసుకునే నిర్ణయాలు, తదుపరి కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!