

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనుండగా, మంత్రి సీతక్క సభ్యురాలిగా నియమితులయ్యారు. ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తే సమస్యలను అంచనా వేస్తూ, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ముందస్తు చర్యలపై కమిటీ దృష్టి సారించనుంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మంత్రి సీతక్క తాగునీటి సరఫరాపై నిరంతరం సమీక్షలు నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే సవాళ్లను ముందుగానే గుర్తించి, ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!