
జనరల్

‘జననాయగన్’ మరియు కరూర్ ఘటనలపై కుట్ర జరిగిందని స్టార్ నటుడు, టీవీకే అధినేత విజయ్ ఆరోపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న ఆయన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక ఉమ్మడి కుట్ర కోణం దాగి ఉందని ఆయన అన్నారు.
ఈ ఘటనలో తనకు కూడా న్యాయం జరగాలని విజయ్ కోరారు. అదేవిధంగా తన చివరి చిత్రం ‘జననాయగన్’ విడుదల ఆలస్యానికి కూడా కుట్ర కారణమని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన విజయ్ ఈ అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!