

భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్‌హౌస్‌ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సందర్శించారు. అక్కడ ప్రవహిస్తున్న గోదావరి జలాలను పరిశీలించిన ఆమె, కరువు పరిస్థితుల్లోనూ సుమారు 2 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 93 మీటర్ల పొడవునా కాఫర్ డ్యామ్ నిర్మిస్తే మేడిగడ్డ బ్యారేజీపై ఆధారపడకుండా నీటిని ఎత్తిపోయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. చేతులు జోడించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని, రైతుల ప్రయోజనాల కోసం కాఫర్ డ్యామ్ నిర్మించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణపై ఆలోచిస్తామని హెచ్చరించారు.
విద్యుత్ సరఫరా నిలిపివేయడం, నీటిని ఎత్తిపోయకుండా అడ్డుకోవడం ద్వారా రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమని కవిత స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసే చర్యలు చేపడతామని, అప్పటివరకు ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడిందని పేర్కొన్న ఆమె, ప్రాజెక్టు కోసం రూ.93 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఆయకట్టు లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మరో రూ.50 వేల కోట్లు అవసరమని అన్నారు. కరువు పరిస్థితులు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరిని బయటపెట్టాయని విమర్శించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!