

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతదూరమైనా పోరాడాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థీకృతంగా హింసకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు రాలేదని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని నడుపుతున్నవారే హింసకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జగన్ విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నారని ప్రశంసించారు. ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన పటిష్టమైన ఆధారాలను సేకరించి కోర్టుల ముందుంచాలని, న్యాయపోరాటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!