

అగ్నిపరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన సృష్టి అలియాస్ శివ సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ తెలుగు 10లో మెయిన్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సృష్టి ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తోంది. బిగ్ బాస్ షోపై ఆసక్తితో అగ్నిపరీక్షకు దరఖాస్తు చేసుకోగా, నిర్వాహకులు ఆమెకు సీజన్ 2లో అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సృష్టి.. డేరింగ్ టాస్క్‌లు, సాహసోపేతమైన ప్రదర్శనలతో జడ్జిలతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
అగ్నిపరీక్షలో ప్రతిభ చూపిన కంటెస్టెంట్లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాన్ని ఈసారి యాంకర్ శ్రీముఖికి ఇచ్చారు. ఆమె సృష్టిని ఎంపిక చేయడంతో బిగ్ బాస్ తెలుగు 10లో మెయిన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. ఇప్పటికే అగ్నిపరీక్ష నుంచి ఝాన్సీ, అమన్ మసూద్, షాలినీ పటేల్ వంటి కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగా, ఇప్పుడు సృష్టి కూడా వారి సరసన చేరింది. డేరింగ్ టాస్క్‌లకు పేరుగాంచిన సృష్టి బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి ఆటతీరును ప్రదర్శిస్తుందో ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!