

యాంకర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ సుధీర్ రెడ్డి బిగ్ బాస్ తెలుగు 10లో నాలుగో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. రాయలసీమలోని నంద్యాలలో పుట్టి పెరిగిన సుధీర్ గతంలో ఓ మీడియా ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేశాడు. అనంతరం సొంతంగా డిజిటల్ కంటెంట్‌పై దృష్టి పెట్టి ‘సుధీర్ టాక్స్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు. ఇందులో పలువురు వ్యాపారవేత్తలు, డాక్టర్లు, సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు.
సోషల్ మీడియాలోనూ సుధీర్ రెడ్డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు యాంకర్‌గా, ఇంటర్వ్యూయర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో మాట్లాడిన అనుభవం, కెమెరా ముందు ఉండే అలవాటు బిగ్ బాస్ హౌస్‌లో ఆయనకు ఎంతవరకు ఉపయోగపడతాయో ఆసక్తికరంగా మారింది. ఈ షోలో సుధీర్ ఎలాంటి ఆటతీరును ప్రదర్శిస్తాడో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!