

బిగ్ బాస్ తెలుగు 10 మొదటి రోజే కామనర్స్ సెలెక్షన్‌పై వివాదం మొదలైంది. అగ్నిపరీక్ష ద్వారా ఆరుగురు కామనర్స్‌ను ఎంపిక చేయగా.. కొందరి ఎంపికపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కామనర్స్ సెలెక్షన్ పూర్తిగా ఆడియన్స్ ఓటింగ్, కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్ ఆధారంగానే జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా అమన్ మసూద్, సృష్టి వ్యాకరణం ఎంపికపై కొందరు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు రామకృష్ణ, మిథిలేష్, దీపక్, హేమంత్, రాజాకుమారి వంటి వారు అగ్నిపరీక్షలో మంచి ప్రదర్శన ఇచ్చినా ఎందుకు ఎంపిక కాలేదని చర్చిస్తున్నారు. అమన్, షాలినిని లవ్ ట్రాక్ కోసమే ఎంపిక చేశారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. ఝాన్సీ, రోహిత్ నాయుడు ఎంపికపై మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. దీంతో కామనర్స్ సెలెక్షన్ నిజంగా ఆడియన్స్ నిర్ణయమా? లేక ముందుగానే ప్లాన్ చేశారా? అనే ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!